ఇండ్లలోకి మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు
విశ్వంభర, బడంగ్‌పేట్: బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలోని తిరుమల నగర్, రోడ్ నెం.2లో మురుగు నీటి సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పదేళ్లుగా నివసిస్తున్న స్థానికులు కాలనీలోని సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పైభాగంలో ఉన్న ఇళ్ల నుంచి వచ్చే నీరు దిగువ ప్రాంతంలోని ఇళ్ల ముందు నిలిచిపోవడంతో మురుగు సమస్య తీవ్రంగా మారిందని తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు పాములు, తేళ్లు వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. నీరు నిల్వ ఉండకుండా ఓ వ్యక్తి తన ఇంటి ముందు 20 ఫీట్ల రోడ్డుపై మట్టిని పోయడంతో సమస్య మరింత పెరిగిందని తెలిపారు. కాలనీ కమిటీ సభ్యుల సూచన మేరకు సమస్య పరిష్కారం కోసం మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులకు మరోసారి వినతిపత్రం అందజేస్తామని, సమస్య పరిష్కారం కాకపోతే జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని కాలనీవాసులు హెచ్చరించారు.