ఎట్ల ఎర్రవల్లి చిన్నవాగు బ్రిడ్జికి నిధులపై కీలక చర్చ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి

ఎట్ల ఎర్రవల్లి చిన్నవాగు బ్రిడ్జికి నిధులపై కీలక చర్చ

విశ్వంభర – షాబాద్:తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను శనివారం రాష్ట్ర సచివాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. ముఖ్యంగా ఎట్ల ఎర్రవల్లి చిన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైతే పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉందని వారు వివరించారు.అలాగే షాబాద్ మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు, చేపట్టాల్సిన పనులపై కూడా చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరినట్లు తెలిపారు. ఈ భేటీలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews