సర్ పై ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ డివిజన్‌లో సర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ నాయకుడు గాయరు విశ్వనాథం ప్రత్యేక ప్రచార వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు . ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్త నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు వంటి సేవలను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడమే ఈ ప్రచార వాహనం ఏర్పాటు లక్ష్యమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గాయరు విశ్వనాథం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మాజీ సర్పంచ్ సాయిల్లు , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.