చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
విశ్వంభర, ముషీరాబాద్ : చేవెళ్ల డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. దళిత సంఘాల నాయకుడు తీగల అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ హక్కులు అమలు కావాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. తీగల అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను ఐక్యం చేసి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం హామీల అమలులో జాప్యం చేయడం సరికాదన్నారు. బైరి వెంకటేశం మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లోని హామీలను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అమలు చేయాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచడం, ప్రైవేటు రంగం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం, ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించడం, ఇల్లు లేని కుటుంబాలకు రూ.6 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మించడం, అసైన్డ్ భూములను పునరుద్ధరించడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం. కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరజ్ మండల్, పాశం యాదగిరి, ఉపదే సనాధన్, పొట్టపింజర రమేష్, బొమ్మేర శ్రీనివాస్ మాదిగ, రాయిల లక్ష్మినర్సయ్య చిందు, మంచాల లింగస్వామి, చిన్నస్వామి మాష్టి, జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.