మంత్రితో కలిసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు శ్రీనివాస్.
విశ్వంభర, హైదరాబాద్: గాంధీ భవన్ (ఇందిరా భవన్) లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజలతో ముఖాముఖి” కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, అవసరాలు, అభ్యర్థనలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని గూడూరు శ్రీనివాస్ అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజలతో ముఖాముఖి ముఖ్య ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందనే నమ్మకం కలిగిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి గ్రీవెన్స్ సెల్ ఇన్చార్జిలు అధికారులు పాల్గొన్నారు.