పర్యావరణాన్ని కాపాడుకుందాం: డి సి శ్రీకాంత్
విశ్వంభర, సరూర్‌నగర్: పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని సరూర్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ కోరారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్‌బీనగర్ జోన్ సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఆయన ఆధ్వర్యంలో ఉద్వాసన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇళ్లలో, వ్యాపార సముదాయాల్లో పూజలకు ఉపయోగించిన పాత దేవతా చిత్రాలు, ఫొటో ఫ్రేములు, విగ్రహాలను ఖాళీ ప్రదేశాల్లో పడేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. వీటిని నివారించేందుకు మున్సిపల్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచనల మేరకు ప్రతి శనివారం సర్కిల్ పరిధిలో ఉద్వాసన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సేకరించిన దేవతా చిత్రాలు, ఫ్రేములను విడదీసి రీసైక్లింగ్ కోసం ‘వేస్ట్ వెంచర్ ఇండియా లిమిటెడ్’ సంస్థకు అందజేస్తున్నట్లు తెలిపారు. రీయూజ్, రీసైకిల్, రిడ్యూస్ విధానాన్ని ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) చందన, అష్టలక్ష్మి టెంపుల్ చైర్మన్ నాగమల్ల శ్రవణ్‌కుమార్, ఏఏ స్వామి, హర్షిత, శానిటరీ సూపర్‌వైజర్ బుచ్చయ్య, ఎస్‌ఎఫ్‌ఏలు శ్రీకాంత్, కీర్తన, అశోక్ తదితరులు పాల్గొన్నారు.