కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్‌లో యాంజియోప్లాస్టీ
- జేపీ నడ్డాకు గుండె చికిత్స.. యాంజియోప్లాస్టీ చేసిన ఎయిమ్స్ వైద్యులు
JP Nadda: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో జేపీ నడ్డా గుండెకు స్టెంట్లు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
జేపీ నడ్డాకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స ప్రారంభించారు. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన సమస్యకు అనుగుణంగా స్టెంట్లు అమర్చినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం నడ్డాను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు. నడ్డా ఆరోగ్యంపై సమాచారం తెలుసుకున్న పార్టీ నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. మరికొంత కాలం వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ నుంచి వచ్చే తదుపరి అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది.