గ్రంథాలయాల కోసం మలిదశ ఉద్యమం
- సెస్ బకాయిలు విడుదల చేయాలి: కోదండరాం
విశ్వంభర, హిమాయత్ నగర్: ప్రజా గ్రంథాలయాలను పరిరక్షించి, బలోపేతం చేసేందుకు మలిదశ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గ్రంథాలయాల ప్రస్తుత పరిస్థితి, సమస్యలు, భవిష్యత్తు అవసరాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరిస్తానని తెలిపారు. హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రజా గ్రంథాలయాలు–ప్రస్తుత స్థితి, సవాళ్లు, భవిష్యత్తు దిశానిర్దేశం’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాలను కేవలం పుస్తక పఠన కేంద్రాలుగా కాకుండా యువతకు విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోదండరాం సూచించారు. మౌలిక వసతులతోపాటు డిజిటల్ సౌకర్యాలు, పుస్తకాలు, సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు వసూలు చేసే ఆస్తి పన్నులోని 8 శాతం గ్రంథాలయ సెస్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. సెస్ నిధులు అందకపోవడంతో గ్రంథాలయాల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు. వివిధ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థలకు కొన్ని వందల కోట్ల రూపాయల సెస్ బకాయిలు ఉన్నాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రొఫెసర్ ఎస్. సుదర్శన్‌రావు గ్రంథాలయ సెస్, అభివృద్ధి, సిబ్బంది నియామకాలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై వివరించారు. గ్రంథాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి సేవలను విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌గౌడ్, ప్రొఫెసర్ ప్రపుల్లచంద్ర, వనం దుష్యంతల, సంఘీశెట్టి శ్రీనివాస్, తుమ్మ సత్యనారాయణ, కస్తూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దాచేపల్లి బుచ్చయ్య, సోమశివయ్య, షేక్ ఆడం షఫీ, బైరి నర్సయ్య, పి. చంద్రయ్య, బి. మహేందర్, కె. వెంకటేశ్వర్‌రెడ్డి, కుమారస్వామి గ్రంథాలయ అభిమానులు హాజరయ్యారు.