పోతారం(ఎస్), దేవేంద్రనగర్‌లో అదనపు బూత్‌లు ఏర్పాటు చేయాలి: తోట స్వరూప
విశ్వంభర, హుస్నాబాద్: ఎస్‌ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు, మండల సంయోజక్ తోట స్వరూప ముఖ్య అతిథిగా హాజరై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పోతారం(ఎస్) గ్రామంలో ఒకే బీఎల్‌ఓ పరిధిలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉండటంతో అదనపు బూత్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక బీఎల్‌ఓను నియమించాలని కోరారు. అలాగే పొట్లపల్లి గ్రామ పరిధిలోని దేవేంద్రనగర్ ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అక్కడ కూడా అదనపు బూత్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ రుక్మిణికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెక్కబండి విద్యాసాగర్, భూతగడ్డపు బాలరాజు, బత్తుల శ్రీనివాస్, తడిసిన రమేష్, బైరి అరుణ్, పలువురు బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.