రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఇలా బుక్ చేశారంటే అంతే..!!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఇలా బుక్ చేశారంటే అంతే..!!

  • ఐఆర్‌సీటీసీ ఐడీపై ఇతరులకు టికెట్ బుక్ చేయొద్దు
  • టికెట్ బుకింగ్‌లో కుటుంబసభ్యులకు మినహాయింపు
  • నిబంధన అతిక్రమిస్తే 3ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా

రైలు రిజర్వేషన్లపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే ఇక నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇది వరకు మీ ఐడీ నుంచి టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇతరులకు సాయం చేయడానికి చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం అలా చేశారంటే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత ఐడీ నుంచి వేరే ప్రయాణికులకు ఆన్‌లైన్ టికెట్ బుక్ చేయడం నేరంగా ఐఆర్‌సీటీసీ పరిగణిస్తోంది. 

ఈ నిబంధనల ప్రకారం మీ ఖాతా నుంచి ఇతరులకు రిజర్వేషన్ టికెట్ బుక్ చేశారంటే 3ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తారు. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ టికెట్ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. ఒకవేళ మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో టికెట్ బుక్ చేస్తే మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబసభ్యులకే చేయాలి. వేరే వ్యక్తులకు చేస్తే జరిమానా, జైలు శిక్ష, లేదా రెండూ ఒకేసారి విధించే అవకాశాలు ఉన్నాయి.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

రైలు రిజర్వేషన్ టికెట్ ఇలా బుక్ చేసుకోవాలి 
ముందుగా  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. బుక్ యువర్ టికెట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.  వెళ్లాల్సిన ప్రదేశం, ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది ఎంపిక చేసుకుని ప్రయాణించే తేదీని నమోదు చేయాలి. స్లీపర్ క్లాస్ లేదా 3-ఏసీ ఎంపిక చేశాక ఏ రైలు అందుబాటులో ఉందో చూసుకోవాలి. బుక్ నౌ పై క్లిక్ చేసి ప్రయాణికుడి వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తత్కాల్ టికెట్ బుకింగ్ ఏసీ టికెట్ అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్ ఏసీ టికెట్ అయితే ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది.