ఆక్రమణలకు చెక్.. క్రెసెంట్ నగర్‌లో పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా.. 1989 లేఅవుట్ పార్క్ స్థలం సేఫ్
HYDRAA: హైదరాబాద్‌లోని క్రెసెంట్ నగర్‌లో 1,200 చదరపు గజాల పార్క్ భూమికి హైడ్రా రక్షణ కల్పించింది. చేంగిచెర్ల ప్రాంతంలోని ఈ స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి, రికార్డులను కూడా పరిశీలించిన అధికారులు ఆ భూమి పార్క్ కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు.
1989లో రూపొందించిన లేఅవుట్‌లో ఈ స్థలాన్ని పార్క్, ప్రజల వినియోగం కోసం కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పార్క్ స్థలం అని నిర్ధారించిన హైడ్రా అధికారులు ఆక్రమణలకు అవకాశం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో 1,200 చదరపు గజాల పార్క్ స్థలం ప్రస్తుతం రక్షణలోకి వచ్చింది.
స్థానికుల ఫిర్యాదులు, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కులు, ఇతర పబ్లిక్ స్పేస్‌లను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా పేర్కొంది. క్రెసెంట్ నగర్‌లో పార్క్ కోసం కేటాయించిన స్థలాన్ని రక్షించడంతో స్థానికులకు మరో ప్రజా స్థలం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లైంది. భవిష్యత్తులో ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు వినియోగించేలా పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.