మహిళకు మత్తు మందు ఇచ్చి 3 తులాల బంగారం చోరీ.. భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
- కల్లు దుకాణానికి తీసుకెళ్లి.. మత్తులోకి జార్చి బంగారం దోపిడీ
Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మత్తు మందు చల్లి మహిళ మెడలోని బంగారు గొలుసు దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన మంగలి మల్లమ్మ అనే మహిళకు గుర్తుతెలియని భార్యాభర్తల జంట పరిచయం పెంచుకుంది. అనంతరం ఆమెను మాటల్లో పెట్టి కల్లు దుకాణానికి తీసుకెళ్లిన నిందితులు మల్లమ్మకు కల్లు తాగించారు. అనంతరం ఆమెను బైక్‌పై ఇంటి వద్ద దింపుతామని చెప్పి ముగ్గురూ కలిసి బయలుదేరారు. మార్గమధ్యంలో మల్లమ్మ ముఖంపై మత్తు మందు చల్లి అపస్మారక స్థితికి తీసుకెళ్లిన నిందితులు, ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు.
ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. బంగారం దోచుకెళ్లిన వారిని కొత్తగోళ్ల బాబు, అతని భార్య కవితగా గుర్తించారు. నిందితుల నుంచి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో నిందితులు ముందస్తు ప్రణాళికతోనే మహిళను పరిచయం చేసుకుని, నమ్మించి బంగారం దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.