రేడియల్ రోడ్-1కు డెడ్‌లైన్.. నాణ్యమైన రహదారుల నిర్మాణంపై సీఎం రేవంత్ ఫోకస్
- హైదరాబాద్ రహదారి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..
- డిసెంబర్ 9లోగా రేడియల్ రోడ్-1 పూర్తి చేయాలని ఆదేశం
Revanth Reddy: హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొంగరకలాన్‌ను ఫ్యూచర్ సిటీతో అనుసంధానించే రేడియల్ రోడ్-1 నిర్మాణాన్ని 2026 డిసెంబర్ 9లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి ఉన్న అన్ని అవరోధాలను తొలగించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీ పడొద్దని, సరైన మట్టి ఎంపికతో పాటు ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
రహదారులకు ఇరువైపులా విస్తృతంగా పచ్చదనం అభివృద్ధి చేయాలని, బాద్వేల్ ఇంటర్‌చేంజ్ ట్రంపెట్‌తో పాటు ఎలివేటెడ్ కారిడార్-1, 2 పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్-3 నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని, కొనసాగుతున్న రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే రహదారి ప్రణాళిక, నిర్మాణంలో ట్రాఫిక్ పోలీసులను భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.