వందేమాతరం చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. అమల్లోకి కొత్త నిబంధనలు

వందేమాతరం చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. అమల్లోకి కొత్త నిబంధనలు

  • వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు.. చట్టంగా మారిన బిల్లు

Vande Mataram Act: వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) చట్టం–2026కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో పార్లమెంట్ ఆమోదించిన బిల్లు అధికారికంగా చట్టంగా మారింది. ఈ సవరణతో వందేమాతరానికి జాతీయ గీతం 'జనగణమన'తో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. కొత్త చట్టం ప్రకారం వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, గానం జరుగుతున్న సమయంలో అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం లేదా దాని గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడటం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. పునరావృతంగా నేరాలకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దేశ గౌరవ చిహ్నాలను మరింత సమర్థంగా పరిరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ చట్టం అమల్లోకి రావడంతో వందేమాతరాన్ని అవమానించే చర్యలపై ఇకపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. ఈ చట్టం ద్వారా వందేమాతరం గౌరవాన్ని కాపాడటంతో పాటు దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

Read More కేఎఫ్‌సీ ప్రియులకు షాకింగ్.. చికెన్‌లో పురుగు...ఎక్క‌డ అంటే?

Related Posts