లిఫ్ట్ ప్రమాదంతో మా కుటుంబం కష్టాల్లో పడింది.. న్యాయం చేయండి: బాధితుడి కూతురు
- హోటల్ నిర్లక్ష్యానికి పెద్దాయన కాలు విరిగితే.. మా తప్పేం లేదంటూ బదులిస్తారా?"
- "ప్రమాదం జరిగింది అక్కడైతే.. సప్తగిరి బల్లా హోటల్‌పై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
Anantapur Tirupalli Hotel: అనంతపురం జిల్లాలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఉన్న తిరుపల్లి (సప్తగిరి బల్ల) హోటల్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28న సింగనమల మండలం నిదనవాడ గ్రామానికి చెందిన దళితుడు లాలు స్వామి తన మనవడి పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా లిఫ్ట్ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామని హోటల్ సిబ్బంది తెలిపి కొంతసేపు వేచి ఉండాలని సూచించారు. అనంతరం లిఫ్ట్ సరిచేశామని, ఉపయోగించవచ్చని చెప్పడంతో లాలు స్వామి లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కగానే తలుపు తెరుచుకుంది. అయితే లిఫ్ట్ క్యాబిన్ అక్కడ లేకపోవడంతో ఆయన నేరుగా లిఫ్ట్ షాఫ్ట్‌లో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో లాలు స్వామి కుడికాలు విరగడంతో అనంతపురంలోని వైఎస్సార్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది. ఘటన అనంతరం హోటల్ యాజమాన్యం సరైన విధంగా స్పందించలేదని, వైద్య ఖర్చులు లేదా ఇతర సహాయంపై ముందుకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో హోటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. కేసు పెట్టిన విషయంపై హోటల్ యాజమాన్యం బాధితుడి కుమార్తెతో బాధ్యతారహితంగా మాట్లాడిందని, "కోర్టులోనే చూసుకుందాం" అంటూ స్పందించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.