కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం.. భర్త హత్యకు భార్య కుట్ర

యాక్సిడెంట్ చేసి చంపు.. భర్త హత్యకు భార్య, ప్రియుడి ప్లాన్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడులో భర్తను హత్య చేయించేందుకు భార్య పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. “యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు.. లేదంటే నేను చస్తా” అంటూ తన ప్రియుడికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజ్‌లు భర్త గాదే రాజేశ్వరరావుకు కనిపించడంతో విషయం బయటపడింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో రాజేశ్వరరావుకు 2016లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా, అదే సమయంలో భార్య భవాని కొరియర్ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

భర్తను ప్రమాదంగా చూపించి చంపాలని ఆమె ప్రియుడికి సూచించినట్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు బయటపడటంతో రాజేశ్వరరావు షాక్‌కు గురయ్యాడు. తనకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేశ్వరరావు పోలీసులను కోరుతున్నాడు.

Read More పల్నాడులో వైసీపీ నేత దారుణ హత్య.. గొంతు కోసి హతమార్చిన దుండగులు

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/extramarital-affair-with-courier-boy-is-wifes-conspiracy-to-murder/article-21114

Tags: