అంకుసాపూర్‌లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు – అన్నప్రాసన కార్యక్రమం
తంగళ్ళపల్లి ఆగస్టు 07 విశ్వంభర :-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు సూచించారు. అనంతరం ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.