జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
- చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతికి, సంప్రదాయ కళాసౌందర్యానికి చేనేత వస్త్రాలు ప్రతీకలని పేర్కొంటూ, మన చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చేనేత రంగాన్ని కాపాడటం, నేతన్నల సంక్షేమాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కష్టపడి అద్భుతమైన వస్త్రాలను నేసి దేశ సంస్కృతిని నిలబెడుతున్న నేత కార్మికుల శ్రమ అమూల్యమని మంత్రి కొనియాడారు.
చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చేనేత రంగ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. నేతన్నలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రజలంతా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి అండగా నిలవాలని కోరారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.