రేపటి నుంచి తెలంగాణ బంద్?.. ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్
- రేపటి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్
Telangana News: తెలంగాణలో రేపటి నుంచి ఆటో, క్యాబ్, యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 16 వాహన, గిగ్, ప్లాట్‌ఫారం కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో ఇక ఉద్యమమే మార్గమని వాహన, డెలివరీ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది.
ఈ సమ్మెలో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సేవలతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి ఆహారం, నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలు కూడా నిలిపివేయనున్నట్లు జేఏసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపింది.
యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్‌ఫారం సంస్థలు కలిసి కనీస బేస్‌ఫేర్ నిర్ణయించాలని, అలాగే ప్రతి కిలోమీటర్, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను అధికారికంగా ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ కార్మికులు, ఇతర గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నాయి.
అలాగే తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే అమల్లోకి తీసుకువచ్చి, గిగ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను పూర్తిస్థాయిలో అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస ఛార్జీలను నోటిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అదేవిధంగా కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేట్ ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది.