మొక్కే కదా అనుకుంటే పీక కోస్తాం.. కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని స్ట్రాంగ్ వార్నింగ్
- మిత్రధర్మం మరిచితే మూల్యం చెల్లించుకోవాల్సిందే.. కాంగ్రెస్‌ను హెచ్చరించిన కూనంనేని
Kunamneni Sambasiva Rao: కాంగ్రెస్ పార్టీపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షంగా కలిసి ప్రయాణిస్తున్న సీపీఐని తక్కువ అంచనా వేయడం, అవమానించే ధోరణి సరికాదని హెచ్చరించారు. "మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే పీక కోస్తాం" అంటూ కాంగ్రెస్‌కు ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. స్నేహధర్మాన్ని గౌరవిస్తూ ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, కానీ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను మాత్రం సహించబోమన్నారు.
సీపీఐని చిన్న పార్టీగా చూసి నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. "మమ్మల్ని తక్కువ అంచనా వేసినా, అవమానించినా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మిత్రపక్షాన్ని గౌరవించడం నేర్చుకోవాలి" అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రజల ప్రయోజనాల కోసమేనని, దాన్ని బలహీనతగా భావిస్తే తప్పు చేస్తున్నట్టేనని అన్నారు.
"మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు. మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు, మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది" అంటూ కూనంనేని తీవ్రస్థాయిలో విమర్శించారు. కమ్యూనిస్టుల బలం సంఖ్యలో కాకుండా సిద్ధాంతాల్లో, ప్రజా ఉద్యమాల్లో ఉంటుందని పేర్కొన్నారు. పది మంది మాత్రమే ఉన్నారని తక్కువగా చూసే వారు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మిత్రపక్షాల మధ్య పరస్పర గౌరవం, సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందని కూనంనేని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తమ వైఖరిని మార్చుకుని మిత్రపక్షాల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు కాంగ్రెస్‌నే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.