ఘనంగా ఆషాడ మాసం బోనాలు
విశ్వంభర, హైదరాబాద్ :- ఆషాడ మాసం మహోత్సవంలో భాగంగా ఆలె భవ్య గ్రేటర్ హైదరాబాద్ బీసీ మహిళా ప్రెసిడెంట్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆలె భవ్య మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా శుభసూచకమని, కలిసికట్టుగా ఉండడానికి బీసీ ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని, అలాగే పాడిపంటలు, ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, అందె శ్రీరాములు, కోట్ల శ్రీనివాసులు వైస్ చైర్మన్ గిటార్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ, బీసీ నేషనల్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, శ్రీనివాస్, పోసాని హిమబిందు, పోసాని విజయ్ కుమార్, ఆలె జితేందర్, తదితర బీసీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.