అస్వస్థతకు గురైన మాజీ సర్పంచ్ రాజును పరామర్శించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు

  • శనిగపురం మాజీ సర్పంచ్ రాజును పరామర్శించిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు

Takkelapalli Ravinder Rao:  మహబూబాబాద్ జిల్లాలోని శనిగపురం గ్రామ మాజీ సర్పంచ్ రాజు అస్వస్థతకు గురై దీప్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతూ, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

రాజు త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అవసరమైతే అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని మాజీ సర్పంచ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More బాధిత కుటుంబానికి అయ్యప్ప భక్తుల చేయూత

🕒 07 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mlc-ravinder-rao-visited-former-sarpanch-raju-who-fell-ill/article-21086