ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. సీఎం చంద్రబాబు

  • చేనేత, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  • చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం.. సూర్యలంకపై ప్రత్యేక దృష్టి: సీఎం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, చేనేత రంగం, మౌలిక సదుపాయాల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక శ్రద్ధ చూపిన వర్గం చేనేత కార్మికులేనని, చేనేతలకు టీడీపీ తప్ప మరో గుర్తు తెలియదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎక్కడా గుంతలు లేని రహదారులను నిర్మిస్తున్నామా లేదా అని నిరంతరం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానం, తెలివితేటలతో పనిచేస్తే సులభంగా ఆదాయం సంపాదించవచ్చని యువతకు సూచించారు. రాష్ట్రంలోని బీచ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సూర్యలంక బీచ్‌కు వస్తున్నారని, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు.

Read More పల్నాడులో వైసీపీ నేత దారుణ హత్య.. గొంతు కోసి హతమార్చిన దుండగులు

🕒 07 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-will-make-ap-a-logistic-hub/article-21088