దహీ హండి గోవిందాలకు మహారాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్.. రూ.10 లక్షల బీమా
- గోవిందాల భద్రతకు భారీ నిర్ణయం.. రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
Dahi Handi Festival: దహీ హండి ఉత్సవాల్లో పాల్గొనే గోవిందాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దహీ హండి వేడుకల్లో పాల్గొనే గోవిందాలకు రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ బీమా పథకం ప్రకారం ఉత్సవాల సమయంలో ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవించినట్లయితే రూ.10 లక్షల వరకు బీమా వర్తించనుంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో యువకులు మానవ పిరమిడ్లు ఏర్పాటు చేసి దహీ హండి ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.60 లక్షల మంది గోవిందాలు దహీ హండి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారందరికీ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో సమగ్ర బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నిర్వాహకులు, గోవిందాలు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని, రక్షణ పరికరాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయంతో గోవిందాలకు మరింత భద్రత కల్పించడంతో పాటు దహీ హండి ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.