నాలుగేళ్ల చిన్నారికి ఎక్స్‌పైరీ సిరప్.. మహబూబాబాద్ ఆసుపత్రి సిబ్బందిపై తండ్రి ఆగ్రహం
- మహబూబాబాద్ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ మందు కలకలం.. చిన్నారి తండ్రి ఆగ్రహం
Mahabubabad News: మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసిందంటూ ఓ కుటుంబం ఆరోపిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారికి గడువు ముగిసిన సిరప్‌ను ఆసుపత్రి సిబ్బంది ఇచ్చారంటూ బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల నాణ్యత, పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ను వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓపీలో వైద్యులు చిన్నారిని పరీక్షించి రెండు రకాల సిరప్‌లు రాశారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రి ఫార్మసీ నుంచి ఇవ్వగా, మరో మందును బయట నుంచి కొనుగోలు చేయాలని సిబ్బంది సూచించారు.
ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారికి మందు వేసే ముందు సిరప్ సీసాపై ఉన్న గడువు తేదీని పరిశీలించిన తండ్రి మురళి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సిరప్‌కు జూన్-2026లోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. వెంటనే మందుతో కలిసి ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. ఈ క్రమంలో తండ్రికి, ఆసుపత్రి సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
"గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా?.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యమా?" అంటూ బాలుడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందించే మందుల గడువు తేదీలను ఎవరూ పరిశీలించడం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిల్వ ఉంచిన మందుల గడువు తేదీలను వెంటనే తనిఖీ చేసి, రోగులకు నాణ్యమైన మందులే అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.