తెలంగాణకు శనిలా మారాడు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..

  • జయశంకర్ జయంతి వేదికగా కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
  • ఉద్యోగాలు, ప్రాజెక్టులు, ఢిల్లీ పర్యటనలు.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం

KTR: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు.. తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా తయారయ్యాడు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ శాశ్వత శత్రువని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారని, అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు.

ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1.60 లక్షల మందికి నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో యువతను రెచ్చగొట్టి ఇప్పుడు వారిని నిరాశపరిచారని విమర్శించారు.

Read More హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారు.. సీఎం రేవంత్‌పై ఈటల ఫైర్

ఇటీవల తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్. విద్యాసాగర్ రావు వంటి మహనీయులను విస్మరించడం తెలంగాణ ఆత్మను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని గుర్తించే సంస్కారం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి అర్థమేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ పనితీరుపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలమూరు, కన్నెపల్లి పంపులను ప్రారంభించడం లేదని, రాష్ట్ర అప్పులపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. అలాగే 32 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా కేంద్రం ఎదుట తలవంచే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ స్వాభిమానం, స్వయం పాలన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చూపిన మార్గమే తమకు ఆదర్శమని, అదే బీఆర్ఎస్ సిద్ధాంతమని కేటీఆర్ స్పష్టం చేశారు.

🕒 06 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ktr-fire-on-revanth-who-has-become-saturn-for-telangana/article-21025