డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరు.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు

  • సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా డిమాండ్.. నేటి నుంచి వైసీపీ రిలే నిరాహార దీక్షలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు కొనసాగనున్నట్లు పార్టీ ప్రకటించింది.

డీఎస్సీ వ్యవహారంపై ఇప్పటికే పలు దశల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ.. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ ఇప్పుడు రిలే నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది.

Read More ముస్తఫా అరెస్ట్ రాజకీయ కక్షసాధింపే.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలు ముగిసిన అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పార్టీ నేతలు వెల్లడించారు.

🕒 06 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/the-ycp-relay-hunger-strike-from-today-is-an-initiative/article-21013