సీతక్క నియోజకవర్గంలో రోడ్డు దుస్థితి.. వరి నాట్లతో నిరసన తెలిపిన ప్రజలు

Seethakka Constituency: ములుగు నియోజకవర్గంలో రోడ్డు దుస్థితిపై గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీతక్క నియోజకవర్గంలోని కొత్తమల్లూరు గ్రామంలో రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో రోడ్డుపైనే వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి వర్షం కురిసిన ప్రతిసారి నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు, పాదచారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైనే వరి నాట్లు వేసి నిరసన తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తమల్లూరు గ్రామ రహదారికి నిధులు మంజూరు చేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారిని బాగుచేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/people-who-protested-the-road-condition-in-sitakka-constituency-with/article-21112

Tags: