ప్రేమకు ఖాకీ అడ్డంకి కాదు.. ఏడుస్తున్న పాపాయిని ప్రేమగా ఓదార్చిన పోలీస్ ఆఫీసర్

ఏడుస్తున్న చిన్నారికి అండగా నిలిచిన POCSO కోర్టు సీడీఓ

LB Nagar POCSO Court: ఎల్‌బీ నగర్ POCSO కోర్టులో మానవత్వాన్ని ప్రతిబింబించే ఘటన చోటుచేసుకుంది. సాక్ష్యం ఇవ్వడానికి కోర్టుకు వచ్చిన ఓ బాధితురాలితో ఉన్న చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన POCSO Court CDO వెంటనే స్పందించారు. చిన్నారిని ప్రేమగా అక్కున చేర్చుకుని ఓదారుస్తూ, బాధితురాలు కోర్టు ప్రక్రియ పూర్తిచేసుకుని వచ్చే వరకు భద్రంగా చూసుకున్నారు. అంతేకాకుండా బాధితురాలికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ధైర్యం చెప్పారు.

పోలీసుల విధి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, అవసరమైన సమయంలో బాధితులకు మానసికంగా అండగా నిలవడమనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. కోర్టుకు వచ్చిన చిన్నారిని సొంత బిడ్డలా చూసుకుంటూ చూపిన ఆప్యాయత, బాధితురాలికి అందించిన భరోసా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసుల ఈ మానవీయ స్పందన సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రశంసలు అందుకుంటోంది.

Read More లాల్‌బజార్ బోనాల జాతరకు భక్తుల వెల్లువ.. నేడు రంగం కార్యక్రమం

🕒 07 Aug 2026 ✍️ Desk

ప్రేమకు ఖాకీ అడ్డంకి కాదు.. ఏడుస్తున్న పాపాయిని ప్రేమగా ఓదార్చిన పోలీస్ ఆఫీసర్

LB Nagar POCSO Court: ఎల్‌బీ నగర్ POCSO కోర్టులో మానవత్వాన్ని ప్రతిబింబించే ఘటన చోటుచేసుకుంది. సాక్ష్యం ఇవ్వడానికి కోర్టుకు వచ్చిన ఓ బాధితురాలితో ఉన్న చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన POCSO Court CDO వెంటనే స్పందించారు. చిన్నారిని ప్రేమగా అక్కున చేర్చుకుని ఓదారుస్తూ, బాధితురాలు కోర్టు ప్రక్రియ పూర్తిచేసుకుని వచ్చే వరకు భద్రంగా చూసుకున్నారు. అంతేకాకుండా బాధితురాలికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ధైర్యం చెప్పారు.

పోలీసుల విధి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, అవసరమైన సమయంలో బాధితులకు మానసికంగా అండగా నిలవడమనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. కోర్టుకు వచ్చిన చిన్నారిని సొంత బిడ్డలా చూసుకుంటూ చూపిన ఆప్యాయత, బాధితురాలికి అందించిన భరోసా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసుల ఈ మానవీయ స్పందన సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రశంసలు అందుకుంటోంది.

🔗 https://www.vishvambhara.com/telangana/khaki-is-not-an-obstacle-to-love-but-the-police/article-21096