తోటి సిబ్బంది మానవత్వం.. జవాన్ కుటుంబానికి రూ.5.20 లక్షల చేయూత

విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం జవాన్ అరే కిరణ్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.5.20 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓఎస్‌డీ వి.బి. కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా కిరణ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన సర్వీస్ ప్రయోజనాలు, ప్రమాద బీమా నిధులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విరాళాల సేకరణలో కృషి చేసిన ఆర్‌ఐ అడ్మిన్ శ్రీధర్ రెడ్డి, దినేష్ రెడ్డి, కె. శ్రవణ్ కుమార్, కె. సుమన్, ఎస్. సాగర్‌తో పాటు సహకరించిన సిబ్బందిని ఓఎస్‌డీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అడ్మిన్ జి. చక్రవర్తి, డిప్లాయ్‌మెంట్ ఎస్పీ సయ్యద్ బాషా, ఎస్పీలు శ్రీనివాస్, రాంచందర్ రావు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొని కిరణ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-humanity-of-the-fellow-personnel-contributed-rs-520-lakh/article-20068

Tags: