తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ లక్ష్యం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అర్హత లేని వారి పేర్లు లేకుండా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి అన్నారు. ఎస్ ఐ ఆర్ –2026లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎన్యుమరేషన్ ఫారాల సవరణ, డిజిటలైజేషన్, ఎన్నికల షెడ్యూల్‌పై శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సవరించిన ఎన్నికల షెడ్యూల్‌ను వివరించారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు BLOలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదలవుతుందని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ముసాయిదా జాబితా ప్రచురణకు ముందే ఎన్యుమరేషన్ ఫారాల్లో అవసరమైన సవరణలు, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో పేరు, స్థలం మార్పు, కొత్త కేంద్రాల ఏర్పాటు, విలీనం వంటి అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 1,200 మంది ఓటర్ల పరిమితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. గేటెడ్ కమ్యూనిటీలకు సమీపంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైనా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపులో పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. వారి సూచనలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బి ఎల్ ఓ లు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేసి విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, ఈఆర్‌ఓలు, డీఆర్వో శారదాదేవి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.