డ్రగ్స్‌, గంజాయిపై పోరుకు పోతురాజు వేషధారణలో ప్రచారం 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో డ్రగ్స్, గంజాయి మరియు రోడ్డు భద్రతపై పోతురాజు వేషధారణలో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ గౌడ్ ఈ వేషధారణలో అంబేద్కర్ నగర్, గిరిజన కళాశాల బాలుర వసతి గృహంలో ప్రచారం చేపట్టారు. చెడును తరిమికొట్టే శక్తికి ప్రతీక అయిన పోతురాజు రూపంలో ఆయన మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలను వివరించారు. యువత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తెవాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లేవారు సీటు బెల్టు విధిగా ధరించాలని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. "నో డ్రగ్స్ - సేవ్ లైఫ్" అంటూ కరపత్రాలు పంచుతూ, జానపద కళలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ కోటేష్, ఏఎన్ఎం జయ, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/campaign-in-the-guise-of-poturaju-to-fight-against-drugs/article-21303

Tags:  

Advertisement

LatestNews

శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం
యాదాద్రి ఫార్మాలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల.. మాట మీద నిలబడాలి. -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
22ఏ భూముల నిబంధన దుర్వినియోగం అవుతోంది: నారాయణ