శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో ఘనంగా బోనాల పండుగ
విశ్వంభర, పెద్దపల్లి : పెద్దపల్లి సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు ఎం. మంజుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోనాల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పండుగలో భాగంగా చిన్నారులు బోనాలు ఎత్తుకొని, పోతురాజు వేషధారణలో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. డప్పుల మోత, పోతురాజు విన్యాసాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పోషకులు, విద్యార్థులు, విద్యార్థినులు, ప్రధానాచార్యులు, ఆచార్య బృందం తదితరులు పాల్గొన్నారు.