విజయవాడ ధర్నా చౌక్‌లో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

విజయవాడ ధర్నా చౌక్‌లో శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

  • విజయవాడ నడిబొడ్డున నిరసనకు శ్రీకారం.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

Vijayawada Dharna Chowk: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడ నడిబొడ్డున ఉన్న ధర్నా చౌక్‌ వద్ద శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి కార్యకర్తలు, వివిధ జిల్లాల నాయకులు, వీసీకే పార్టీ నాయకులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా జై భీమ్‌ రావు భారత్‌ పార్టీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం అర్బన్‌ ఇన్‌చార్జ్‌ నరేష్‌ కొడివెండ్ల, కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్‌ నూతిమడుగు వెంకటేష్‌, సత్యసాయి జిల్లా నాయకులు ధారా శంకర్‌, అనంతపురం జిల్లా అధ్యక్షులు గట్టు రామంజి తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: