సర్ ప్రక్రియను పరిశీలించిన  తహసీల్దార్ నరేష్

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని మునిగల వీడు గ్రామంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ నమోదు డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని తహసిల్దార్ చంద నరేష్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ లను గ్రామంలో ఎంతవరకు ఓటరు నమోదు ప్రక్రియ డిజిటలైజేషన్ జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సందర్భంగా బిఎల్వోలు తాసిల్దార్ కు హోటల్ డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుపుతూ గ్రామంలో 100% నమోదు ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు తహసిల్దార్ బి ఎల్ఓ లను అభినందించారు.కార్యక్రమంలో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు, బిఎల్వోలు కవిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sir-tahsildar-naresh-who-inspected-the-process/article-20076

Tags: