ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం

వీడియో సాక్ష్యాలున్నాయి.. చర్యలు తీసుకోకుంటే మరో కథనం తప్పదు

anatapuram janana marana certificet Anantapur Municipal Office: అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువీకరణ విభాగంపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన బర్త్, డెత్ సర్టిఫికెట్లను సాయినగర్ జీరో క్రాస్‌లోని ఓ నెట్ సెంటర్‌లో డబ్బులు తీసుకుని ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో సర్టిఫికెట్ పేపర్‌కు రూ.40 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలో జారీ కావాల్సిన సర్టిఫికెట్లు బయట నెట్ సెంటర్‌కు ఎలా వెళ్తున్నాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్ PDF ఫైళ్లను నెట్ సెంటర్‌కు పంపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయం నుంచి ఒరిజినల్ ఫైళ్లు నెట్ సెంటర్‌కు వెళ్తున్నాయా? ప్రభుత్వ కార్యాలయంలో ఉచితంగా అందించాల్సిన సర్టిఫికెట్లకు బయట డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఓ మరణ ధ్రువీకరణ పత్రం విషయంలో అధికారి మధ్యవర్తి ద్వారా డబ్బులు అడిగినట్లు బాధితుడు తెలిపినట్లు సమాచారం. సర్టిఫికెట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Read More ఫ్రెండ్స్ డే రోజున విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు యువకుల మృతి

ఈ వ్యవహారంపై గతంలో కూడా కథనాలు వెలువడినప్పటికీ అధికారులు స్పందించలేదని బాధితులు, స్థానికులు చెబుతున్నారు. ఆగస్టు 18న వి3 న్యూస్ ఛానల్‌కు చెందిన విలేఖరి ఈ అంశంపై విశ్వంభర వెబ్‌సైట్‌లో కథనం ప్రచురించారు. అనంతరం ఈ కథనాన్ని ఫేక్ న్యూస్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని వి3 న్యూస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో పాటు పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వి3 న్యూస్ ఛానల్, వి3 విలేఖరి స్పష్టం చేస్తున్నారు. ఆ ఆధారాలను పరిశీలించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో మరో కథనంతో మీ ముందుకు వస్తుంది.

వీడియో ఫ్రూఫ్‌ ఇదిగో...👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

🕒 21 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/dont-be-afraid-of-fake-campaigns-we-will-prove-it/article-21871

Advertisement