నగరవాసులపై చెత్త భారం.. టార్గెట్ రూ.216 కోట్లు

నగరవాసులపై చెత్త భారం.. టార్గెట్ రూ.216 కోట్లు

హైదరాబాద్ నగరవాసులపై మరో ఆర్థిక భారం పడనుంది. ఇంతకు ముందు రిక్వెస్టుగా అడిగి తీసుకున్న చెత్త పన్ను ఇప్పుడు తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. గ్యార్బెజీ పాయింట్లు లేని నగరంగా తీర్చిదిద్దటం కోసం జీహెచ్ఎంసీ దశల వారీగా 3,250 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకుంది. దీంతో చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తుంది. ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు జీతాల్లేని కార్మికులను నియమించించింది. అయితే.. ఈ చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు ప్రతీ కుటుంబం నెలకు రూ.100 చెల్లించాలని.. అయితే కేవలం రిక్వెస్టు మాత్రమేనని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో చెప్పారు. 

 

Read More ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా  తేలుకుంట్ల చంద్రశేఖర్

అయితే.. ఇప్పుడు అది రిక్వెస్టులా కాకుండా తప్పనిసరి చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతోంది. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. రిక్వెస్టుగా తీసుకోవాల్సిన డబ్బును.. స్వేచ్ఛ ఆటో కార్మికులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. డబ్బు ఇవ్వకపోతే చెత్తను సేకరించడం లేదని కూడా కొందరు చెబుతున్నారు. దీంతో.. చెత్తపై పన్ను వేస్తే.. ఇక రెండో దారి లేక కార్మికులు చెత్తను తప్పనిసరిగా ప్రతీ ఇంటి నుంచి సేకరిస్తారని జీహెచ్ఎంసీ భావిస్తోంది. 

 

Read More ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా  తేలుకుంట్ల చంద్రశేఖర్

హైదరాబాద్‌లో కాలనీలోనైతే రూ.వంద, బస్తీల్లోనైతే రూ.50 చెల్లించాలన్న నిబంధనను త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 లక్షల ఇళ్లు ఉన్నాయని ఓ అంచనా. సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.75 చెల్లించినా, నెలకు రూ.18 కోట్లు, అలాగే ఏడాదికి రూ.216 కోట్ల భారం జనంపై హైదరాబాద్ వాసులపై పడుతుంది.