చండూరు మున్సిపాలిటీలో స్వర్గపురి వాహనం సమకూర్చాలని వినతి  

చండూరు, విశ్వంభర :-  చండూరు మున్సిపాలిటీ ప్రజలకు స్వర్గపురి వాహనాన్ని(చనిపోయిన వారిని స్మశాన వాటిక వరకు తీసుకెళ్లే వాహనం) సమకూర్చాలని కోరుతూ చేనేత పరిరక్షణ సేవాసమితి, చేనేత కార్మిక సంఘం, మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో పలువురు మంగళవారం  చండూరు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ తరపున వాహనం లేకపోవడంతో ప్రవేట్ వాహనాన్ని పెట్టుకోవడానికి పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. మున్సిపాలిటీ తరపున వాహన్నాని కొనుగోలు చేయాలని లేదా  దాతల సహకారంతో నైనా సమకూర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.  లేకపోతే ప్రవేట్ స్వర్గపురి  వాహనానికి అయ్యే ఖర్చులను మున్సిపాలిటీనే భరించాలని వారు కోరారు. బుధవారం జరిగే మున్సిపల్ సమావేశంలో స్వర్గపురి వాహనం ఏర్పాటు పై తప్పక చర్చిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ మణికరన్, అలాగే వినతి పత్రం ఇచ్చే సమయానికి అక్కడే ఉన్న కౌన్సిలర్లు గుంటి వెంకటేశం,అన్నపర్తి శేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు శ్రీను, కర్నాటి శ్రీనివాసులు,ఏలె శ్రీను, రాపోలు వెంకటేశం, సంగెపు శ్రీను, చెరుపల్లి కృష్ణ, గంజి బిక్షం, తిరందాసు నందు, చెరుపల్లి వెంకన్న, వర్కాల విజయ్, చెరుపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏలే మహేష్ నేత 
స్టేట్ సీనియర్ కరెస్పాడెంట్ 
వి3 న్యూస్ ఛానల్ & విశ్వంభర దిన పత్రిక 

Read More వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే

🕒 30 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/request-to-provide-swargapuri-vehicle-in-chandur-municipality-%C2%A0/article-3475

Tags:  

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం