కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి

కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రహదారిపై కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతులను వెంకటేశ్‌ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్‌ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More రూ.30 వేలు తీసుకుంటూ ఎస్‌ఐ.. రూ.15 వేలు తీసుకుంటూ జీపీవో పట్టివేత

🕒 01 Jun 2024 ✍️ Desk

కారు, లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి

రహదారిపై కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతులను వెంకటేశ్‌ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్‌ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

🔗 https://www.vishvambhara.com/crime/four-people-including-a-boy-were-killed-when-a-car/article-1089

Advertisement

LatestNews

భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?