గ్రంథాలయాన్ని ప్రత్యామ్నాయ భవనానికి తరలించాలి

  • జిల్లా యంత్రాంగానికి రిటైర్డ్ ఉద్యోగుల వినతి

విశ్వంభర,  హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతున్న గ్రంథాలయాన్ని వెంటనే ప్రత్యామ్నాయ భవనానికి తరలించి, సంఘ భవనాన్ని పూర్తిస్థాయిలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సంఘం నాయకులు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తక్కలపల్లి రాజగోపాల్ రావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనం ఉద్యోగుల సంక్షేమం, సమావేశాలు, వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం వంటి అనేక సేవా కార్యక్రమాల కోసం నిర్మించబడిందని తెలిపారు. అయితే గత కొన్ని నెలలుగా అదే భవనంలో తాత్కాలికంగా ప్రభుత్వ గ్రంథాలయం కొనసాగుతుండటంతో సంఘ కార్యకలాపాల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయం ప్రజలకు అవసరమైన సేవా కేంద్రం అయినప్పటికీ, దానిని అనువైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ భవనానికి తరలిస్తే ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండవని, మరోవైపు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తన భవనంలో నిరాటంకంగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ వినతిని సానుకూలంగా పరిశీలించి గ్రంథాలయాన్ని త్వరితగతిన వేరే ప్రదేశానికి తరలించి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాన్ని పూర్తిగా సంఘానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను ప్రభుత్వం, అధికారులు అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రిటైర్డ్ ఉద్యోగుల హుస్నాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బి. లింగారెడ్డి, ఆర్థిక కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు ఆర్. రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జైన్ సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కృపాసాగర్‌తో పాటు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-library-should-be-shifted-to-an-alternate-building/article-20090

Tags:  

Advertisement

LatestNews

ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్