స్టూడెంట్స్ అలర్ట్.. తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ ఛేంజ్

స్టూడెంట్స్ అలర్ట్.. తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ ఛేంజ్

వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. తెలంగాణలో వచ్చే నెల జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ టైమింగ్స్ మార్చుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు స్కూల్స్ ఉదయం 9.30కి తెరుచుకుని 4.30కి మూతపడేవి. కానీ.. కొత్తగా టైమింగ్స్ ప్రకారం ఉదయం 9 గంటలకే పాఠాశాలలు తెరచుకుని 4.45 వరకు మూతపడనున్నాయి. విద్యార్థులు 9.30కి స్కూలుకు వెళ్లడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్‌పై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందని పాఠశాల శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో.. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా గవర్నమెంట్స్ స్కూల్స్ నడపాలని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

Read More కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి  -

దీంతో పాటు.. వచ్చే అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. జూన్​12 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ లోపు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల ఒకటి నుంచి 11వ తేదీ వరకూ 11 రోజుల పాటు కార్యక్రమాన్ని జరపనున్నారు. అంతేకాదు.. 2024–25 అకడమిక్​ ఇయర్​ క్యాలెండర్‌నుకూడా విద్యాశాఖ రిలీజ్ చేసింది.  

 

Read More కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి  -

వచ్చే ఏడాది 229 రోజులు వర్కింగ్​ డే‌స్ నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి ఐదు రోజుల క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి ఐదు రోజుల సంక్రాంతికి సెలవులు ఫిక్స్ చేశారు. ఇక ప్రతీ రోజూ స్టూడెంట్స్‌తో ఐదు నిమిషాలు యోగా, మెడిటేషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు.. ప్రతీ నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. నెలకు ఒక నో బ్యాగ్ డే చొప్పున ఏడాదికి 10 రోజులు అమలు చేస్తారు.