రాహుల్ గాంధీ.. ఇప్పుడు మేడిగడ్డకు వెళ్లి చూడాలి

 వై.సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్

WhatsApp Image 2024-07-20 at 15.35.49_0a414cb8

విశ్వంభర  జూలై 20 : - కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అబద్దాన్నివందసార్లు చెప్పి నిజం చేయాలనుకుని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్కయ్యింది. తెలంగాణకు ప్రాణధారలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలన్నీ నిర్వీర్యం అయ్యాయి. భారీ ఎత్తున వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ ఠీవిగా నిలబడింది. గతంలో బ్యారేజీకి వెళ్లి నానా యాగి చేసిన రాహుల్ గాంధీని ఇప్పుడు ఒకసారి తీసుకెళ్లి చూపించండి. అప్పుడు రేవంత్ రెడ్డిని వెంటేసుకుని వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా బాధ్యత తీసుకుని మేడిగడ్డకు తీసుకెళ్లండి. ఎలాగూ నెలాఖరులో రాష్ట్రానికి తీసుకొస్తామంటున్నారు కదా. వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లినా ఓ రెండు గంటల్లో మేడిగడ్డకు చేరుకోవచ్చు. కూలిపోయింది.  పనికిరాకుండా పోయింది. 80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడిన రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్లి బ్యారేజీని పరిశీలించండి. వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలకు కూడా చెప్పండి. మేడిగడ్డ ఉందా.? కొట్టుకుపోయిందా.? కూలిపోయిందా..? అనే విషయాలకు ప్రజలకు కూడా వివరించండి. ఎంతసేపు అబద్దాలనే అద్దాల మేడలో ఉండటం కాదు. అప్పుడప్పుడు వాస్తవిక ప్రపంచంలో కూడా జీవించాలని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నాను.

Read More పదవి విరమణ సందర్బంగా ఎస్.ఐ వెంకటరాములుకు ఘనంగా సన్మానం