బాధితులకు న్యాయం... నిందితులకు బేడీలు.. భేష్ అనిపించుకున్న ఆత్మకూరు ఖాకీలు!

  • దోపిడీ దొంగల ముఠా గుట్టురట్టు... ఆత్మకూరు పోలీసులకు సలామ్

Atmakur news: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామం వద్ద రెండు వాహనాలపై దాడి చేసి నగదు దోచుకున్న ఘటనను ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున పంపునూరు గ్రామం వద్ద ఒక బొలెరో పికప్ ట్రక్‌తో పాటు మరో వాహనంపై దుండగులు దాడి చేసి సుమారు రూ.20 వేల నగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఆత్మకూరు పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ఒక బొలెరో పికప్ ట్రక్, టాటా వాహనం, రూ.30 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Read More మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ

ఈ కేసులో ఏ1 నిందితుడు రంజిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తులో వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

🕒 17 Aug 2026 ✍️ Desk

బాధితులకు న్యాయం... నిందితులకు బేడీలు.. భేష్ అనిపించుకున్న ఆత్మకూరు ఖాకీలు!

Atmakur news: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామం వద్ద రెండు వాహనాలపై దాడి చేసి నగదు దోచుకున్న ఘటనను ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున పంపునూరు గ్రామం వద్ద ఒక బొలెరో పికప్ ట్రక్‌తో పాటు మరో వాహనంపై దుండగులు దాడి చేసి సుమారు రూ.20 వేల నగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఆత్మకూరు పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ఒక బొలెరో పికప్ ట్రక్, టాటా వాహనం, రూ.30 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఏ1 నిందితుడు రంజిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తులో వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/justice-for-the-victims-bedis-for-the-accused-khakis-for/article-21752

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి