కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారు

  • మోదీ నివాసం ముట్టడి యత్నంపై హుస్నాబాద్‌లో బీజేపీ ధర్నా
  • బిజెపి రాష్ట్ర నాయకులు   కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిరసనగా మహాధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అనంతరం బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, భద్రత, సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేసిన ప్రయత్నం అత్యంత ఖండనీయమన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం అశాంతి సృష్టించే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రధానమంత్రిపై వ్యక్తిగత దాడులు చేయడం, ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. దేశ సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు, రెచ్చగొట్టే చర్యలతో కాలం గడుపుతోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధమైన విధానాలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదని, ప్రజలు కాంగ్రెస్ రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వైఖరిని ఖండిస్తూ, మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ మహాధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, రాష్ట్ర నాయకులు లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, కుంట స్వప్న, జనగామ వేణుగోపాల్ రావు, కర్ణకంటి నరేష్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-07-22 at 8.01.39 PM (1)

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/people-will-reject-the-conspiratorial-politics-of-congress/article-19397

Tags: