అరకు అడవుల్లో ద్రవ గంజాయి అక్రమ రవాణా భగ్నం.. విద్యార్థితో పాటు ముగ్గురు అరెస్ట్

  • విశాఖలో భారీగా గంజాయి పట్టివేత.. రూ.3.75 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం.
  • మత్తు ముఠాపై నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్

Visakhapatnam: మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మరో భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.75 కోట్ల విలువ చేసే 30 కిలోల ద్రవ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ భారీ పట్టివేత చోటుచేసుకుంది. ఈ కేసులో కేరళకు చెందిన మనోజ్, సల్లూ మర్రి, దుంబ్రిగూడకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్ను అధికారులు అరెస్ట్ చేశారు.

నిందితులు ద్రవ గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎన్‌సీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను సీజ్ చేసి, నిందితులను విచారిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రాకెట్ ఉందా? ఇందులో మరెవరెవరికి సంబంధాలున్నాయి? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేసిన ఎన్‌సీబీ, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Read More పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?

🕒 06 Aug 2026 ✍️ Desk

అరకు అడవుల్లో ద్రవ గంజాయి అక్రమ రవాణా భగ్నం.. విద్యార్థితో పాటు ముగ్గురు అరెస్ట్

Visakhapatnam: మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మరో భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.75 కోట్ల విలువ చేసే 30 కిలోల ద్రవ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ భారీ పట్టివేత చోటుచేసుకుంది. ఈ కేసులో కేరళకు చెందిన మనోజ్, సల్లూ మర్రి, దుంబ్రిగూడకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్ను అధికారులు అరెస్ట్ చేశారు.

నిందితులు ద్రవ గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎన్‌సీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను సీజ్ చేసి, నిందితులను విచారిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రాకెట్ ఉందా? ఇందులో మరెవరెవరికి సంబంధాలున్నాయి? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేసిన ఎన్‌సీబీ, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/three-arrested-along-with-a-student-in-smuggling-of-liquid/article-21009