ఓల్డ్ సిటీపై సవతి తల్లి ప్రేమ ఎందుకు?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసదుద్దీన్ ఓవైసీ
- చెత్త, మురుగునీటితో నరకంగా సింగరేణి కాలనీ.. అధికారులపై అసదుద్దీన్ ఫైర్
Asaduddin Owaisi: హైదరాబాద్‌లోని యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్ సింగరేణి కాలనీ దయనీయ పరిస్థితులపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలనీని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి దుస్థితిలో ఎలా జీవిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
సింగరేణి కాలనీలో చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పొంగిపొర్లడం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వంటి సమస్యలు నెలకొన్నాయని ఓవైసీ తెలిపారు. ఈ పరిస్థితులకు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మంచినీటి సరఫరా సంస్థల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కొత్త నగరంలో పరిశుభ్రతపై ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు, పాతబస్తీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పాతబస్తీ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల సమస్యలను పరిశీలించలేదని ఓవైసీ ఆరోపించారు. మున్సిపల్ శాఖను కూడా ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నప్పటికీ ఓల్డ్ సిటీ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. పాతబస్తీ ప్రజల పట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ప్రశ్నించారు.
సింగరేణి కాలనీ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ మంచినీటి సరఫరా సంస్థ ఉన్నతాధికారులు స్వయంగా సందర్శించి పరిశీలించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.