చెవి నొప్పికి వెళితే చేయి నరికేశారు.. ఆస్పత్రులంటేనే వణుకు పుట్టిస్తున్న ఘటన

  • చెవి చికిత్స వికటించి చేయి కోల్పోయిన 20 ఏళ్ల యువతి.. పెళ్లి కూడా క్యాన్సిల్

Bihar News: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే యమధర్మరాజుల్లా మారితే.. పేషెంట్ల పరిస్థితి ఏంటి? తెల్ల కోటు వెనుక ఉన్న కొందరు వైద్యుల దారుణ నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి ఒక నిరుపేద యువతి జీవితం శాశ్వతంగా అంధకారంలోకి వెళ్ళింది. చిన్న చెవి నొప్పి అని ఆస్పత్రికి వెళితే.. మోచేతి పైవరకు చేయి తీసేసే తీసుకొచ్చారు పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యులు. అస‌లు ఏం జ‌రిగింది ఇప్పుడు చూద్దాం.

ఇంజెక్షన్ కాదు.. ఒక జీవితాన్ని నాశనం 

Read More పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్

బిహార్‌లోని శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవి నొప్పితో బాధపడుతూ మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు చిన్న శస్త్రచికిత్స పేరిట తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ ఇంజెక్షన్ వికటించి క్షణాల్లో చేయి రంగు మారిపోయి, నరకాన్ని తలపించే నొప్పి మొదలైంది. "చేయి నల్లబడుతోంది, విపరీతమైన నొప్పి వస్తోంది" అని మొత్తుకున్నా సరే, అక్కడి డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

చేయి తీసేస్తేనే ప్రాణం దక్కుతుందన్నారు

పరిస్థితి చేతులు దాటిపోవడంతో, రేఖ కుటుంబ సభ్యులు ఆమెను దిక్కుతోచని స్థితిలో మెదాంతా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి "తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఇన్ఫెక్షన్ చేయి మొత్తం వ్యాపించింది.. ప్రాణాలు కాపాడాలంటే మోచేతి పైనుంచి చేయిని తీసివేయడం ఒక్కటే మార్గం" అని తెల్చి చెప్పారు. దాంతో వేరే దారి లేక ఆ యువతి ఒక చేయిని కోల్పోవాల్సి వచ్చింది.

వైద్యుల పాపం.. రద్దయిన పెళ్లి

ఒక చిన్న చికిత్స కోసం వెళ్లిన యువతి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జీవితాంతం వికలాంగురాలిగా మారిపోయింది. ఈ దారుణ ఘటనతో ఆమె పడాల్సిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. త్వరలోనే జరగాల్సిన ఆమె వివాహం కూడా ఈ ఘటనతో రద్దయిపోయింది. ఒక వైపు చేయి పోయి, మరోవైపు జీవితం నాశనమై ఆ యువతి, ఆమె కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు.

పోలీసుల వ‌ద్ద కూడా జ‌ర‌గ‌ని న్యాయం

ఇంత జరుగుతున్నా, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడానికి కూడా వెనుకాడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైద్యుల అహంతో కూడిన నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యవస్థల ఉదాసీనతపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తప్పు చేసిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని, రేఖకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రూ కామెంట్లు  చేస్తున్నారు.

🕒 06 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/if-you-go-for-an-earache-your-hand-is-amputated/article-20995

Related Posts