అనంతపురం కలెక్టర్‌ గ్రీవెన్స్‌ డేలో ఉద్యోగుల తీరు.. విధులు మరిచి సెల్‌ఫోన్‌లో బిజీ

అనంతపురం కలెక్టర్‌ గ్రీవెన్స్‌ డేలో ఉద్యోగుల తీరు.. విధులు మరిచి సెల్‌ఫోన్‌లో బిజీ

  • గ్రీవెన్స్‌లో అర్జీలు రాయాల్సింది పోయి సెల్‌ఫోన్‌లో బిజీ.. అనంతపురం కలెక్టరేట్‌లో ఉద్యోగి తీరుపై విమర్శలు

Anantapur Collectorate:అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఓ మహిళా ఉద్యోగి తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని రాయాల్సిన సమయంలో సదరు ఉద్యోగి తన విధులను పక్కనపెట్టి సెల్‌ఫోన్‌లో ఫొటోలు చూస్తూ మరో ఉద్యోగితో ముచ్చట్లు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వస్తుండగా.. వారికి సహకరించాల్సిన ఉద్యోగులు విధుల సమయంలో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గ్రీవెన్స్‌ డేలో అర్జీలు రాసేందుకు వచ్చిన బాధితులకు సహాయం చేయాల్సిన సమయంలో సెల్‌ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు చూపిస్తూ ముచ్చట్లు పెట్టుకోవడం ఉద్యోగుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ విధులు నిర్వర్తించాల్సిన సమయంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Read More ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే గ్రీవెన్స్‌ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితుల్లో.. వారికి సహాయం చేయాల్సిన సిబ్బంది వ్యక్తిగత విషయాల్లో నిమగ్నం కావడం సరికాదని పేర్కొంటున్నారు.

అనంతపురం కలెక్టరేట్‌లో సిబ్బంది విధి నిర్వహణపై గతంలోనూ పలు విమర్శలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. “ప్రజల కోసం పనిచేయాల్సిన ఉద్యోగులు.. విధుల సమయంలో ఇలా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం ఎప్పుడు?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించి, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: