అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. 20 చోరీ బైక్‌లు రికవరీ
- నకిలీ తాళాలతో బైక్‌లు చోరీ.. అనంతపురం పోలీసుల చేతికి ముఠా
Anantapuram news: అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. నమ్మకమైన సమాచారం మేరకు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అనంతపురం, కదిరి, తిరుపతి, కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ ప్రాంతాల్లో వరుసగా మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి 20 చోరీ మోటార్ సైకిళ్లను పోలీసులు రికవరీ చేశారు.
ఈ కేసులో నార్పల గ్రామంలోని చైతన్య కాలనీకి చెందిన కుమ్మర కిశోర్ బాబు (20) ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో ముగ్గురిని బాల నేరస్తులుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితులు నకిలీ తాళాలను ఉపయోగించి పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను చోరీ చేసేవారని, అనంతరం అనంతపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని కంపచెట్లలో వాటిని దాచిపెట్టేవారని విచారణలో వెల్లడైంది.
చోరీ చేసిన బైక్‌లను అనంతరం బెంగళూరు లేదా బళ్లారిలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన 20 మోటార్ సైకిళ్లలో 13 వాహనాలు అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన కేసుల్లో చోరీకి గురైనవిగా గుర్తించారు. మిగిలిన వాహనాలు కదిరి, తిరుపతి, దొడ్డబళ్లాపూర్, అనంతపురం 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులకు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు.
ప్రధాన నిందితుడు కుమ్మర కిశోర్ బాబును ఉదయం 8.30 గంటల సమయంలో అనంతపురం టౌన్‌లోని ఎన్టీఆర్ మార్గ్ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని బాలలుగా గుర్తించడంతో వారికి వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన బైక్ చోరీ కేసులకు సంబంధించి ముఠా నుంచి వాహనాలను రికవరీ చేయడంతో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
ప్రజలకు పోలీసుల సూచనలు:
మోటార్ సైకిళ్లను పార్క్ చేసే సమయంలో తప్పనిసరిగా హ్యాండిల్ లాక్‌తో పాటు అదనపు భద్రతా పద్ధతులను ఉపయోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయడంతో పాటు విలువైన వస్తువులను వాహనాల్లో ఉంచవద్దని సూచించారు.