పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణా తరగతులు

-ఎంఆర్ఆర్ ఫౌండేషన్, మల్ రెడ్డి యువశక్తి నేతృత్వంలో నిర్వహణ

 విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రాబోయే పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ దృష్ట్యా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఎంఆర్ఆర్ ఫౌండేషన్, మల్ రెడ్డి యువశక్తి శుభవార్త తెలిపింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనలో తోడ్పాటు అందించేందుకు ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మల్ రెడ్డి యువశక్తి సారథి మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ శిబిరంలో ఎస్సై, కానిస్టేబుల్ పోలీస్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షకు పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిపుణులైన ఫ్యాకల్టీతో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు, శారీరక దారుఢ్య పరీక్షలకు అవసరమైన శిక్షణను కూడా పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణతో పాటు భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణా శిబిరానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈరోజు ఇబ్రహీంపట్నం మంచాల రోడ్డులోని బైపాస్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తారని వెల్లడించారు. మరుసటి రోజు నుంచి ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ వద్ద ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని చెప్పారు. అనంతరం, నిర్వహించే పరీక్ష ద్వారా  అర్హులను ఎంపిక చేసి, శిక్షణ అందిస్తామన్నారు. వేలాది మంది యువతకు జీవితస్వప్నంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో తమ వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అభిషేక్ తెలిపారు. నియోజకవర్గానికి చెందిన అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాల సాధనకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/free-training-classes-for-police-jobs/article-21293

Tags:  

Advertisement

LatestNews

శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం
యాదాద్రి ఫార్మాలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల.. మాట మీద నిలబడాలి. -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
22ఏ భూముల నిబంధన దుర్వినియోగం అవుతోంది: నారాయణ